రేపటి నుంచే బంపర్ ఆఫర్లు..

రేపటి నుంచే బంపర్ ఆఫర్లు..

పండుగ సీజన్‌లో ప్రత్యేక డిస్కౌంట్లతో పెద్ద సంఖ్యలో వస్తువులను విక్రయించిన ఈ కామర్స్ వెబ్‌సైట్లు... ఇప్పుడు ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్ డేను పురస్కరించుకుని బంపరాఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ కామర్స్ వెబ్ సైట్లో ఒకటైన అమెజాన్.. గ్రేట్ ఇండియన్ సేల్‌ పేరుతో ప్రత్యేక ఆఫర్లు తీసుకొస్తుండగా... రిపబ్లిక్ డే సేల్ పేరుతో ఫ్లిప్‌కార్ట్ రెడీ అయ్యింది. ఈ రెండు ఈ కామర్స్ సంస్థల ప్రత్యేక ఆఫర్లు... రేపటి నుంచే ప్రారంభం కానున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ ఇంకా వివిధ రకాల వస్తువులపై భారీగా తగ్గింపును ప్రకటించింది.  ఫ్లిప్‌కార్ట్ సేల్ ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇక ఎస్‌బీఐ కార్డు ఉన్న వారికి ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌తో పాటు అదనంగా మరో 10 శాతం ఇన్ స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. మరోవైపు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై అదనంగా 10 శాతం ఇన్‌స్టెంట్ డిస్కౌంట్ ఇవ్వనుంది అమెజాన్.