ఫ్లిప్‌కార్ట్ మ‌రో ముంద‌డుగు.. భార‌తీయుల‌కు మ‌రింత చేరువ‌గా..

ఫ్లిప్‌కార్ట్ మ‌రో ముంద‌డుగు.. భార‌తీయుల‌కు మ‌రింత చేరువ‌గా..

ఈ కామర్స్ వ్యాపారాన్ని మరింత విస్తృత పరచడం, భారతీయ భాషల్లోకి వినియోగదారులకు సేవలను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా.. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో ముందడుగేసింది. తమిళం, తెలుగు, కన్నడం భాషలను.. ఫ్లిప్ కార్ట్ వేదికపైకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రాంతీయ భాషల్లోకి సేవలు అందుబాటులోకి తేవడం వల్ల.. వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగాఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. గత ఏడాది హిందీ ఇంటర్‌ఫేస్‌ను ప్రవేశపెట్టిన ఫ్లిప్‌కార్ట్.. ఇప్పుడు తమిళం, తెలుగు మరియు కన్నడ ఇంటర్‌ఫేస్‌లను జోడించింది, ఇవి స్థానిక భాష మాట్లాడేవారికి ఇ-కామర్స్ యాక్సెస్ అడ్డంకులను తగ్గించడంలో స‌హాయ‌ప‌డుతోంద‌ని ఫ్లిప్‌కార్ట్ అంచ‌నా వేస్తోంది.. పరిశ్రమ నివేదికల ప్రకారం, 2021 నాటికి భారతీయ భాషాల్లో ఇంటర్నెట్ వినియోగించేవారు దాదాపు 75 శాతంగా ఉంటార‌ని భావిస్తున్నారు. ఈ కొత్త ప్రయత్నం వినియోగదారులకు వారి స్థానిక భాషలో ఎండ్-టు-ఎండ్ ఈ ‌-కామర్స్ ప్రయాణాన్ని సుల‌భం చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.