హాట్‌స్టార్‌లో ఫ్లిప్‌కార్ట్‌కు వాటా?

హాట్‌స్టార్‌లో ఫ్లిప్‌కార్ట్‌కు వాటా?

స్టార్‌ గ్రూప్‌నకు చెందిన వీడియో స్ట్రీమింగ్‌ కంపెనీ హాట్ స్టార్‌లో వాటా కోసం ఫ్లిప్‌కార్ట్‌ ప్రయత్నిస్తోంది. ఇటీవల ప్లిప్‌కార్ట్ కంపెనీలో అమెరికా కంపెనీ వాల్‌మార్ట్‌ మెజారిటీ వాటా కొనుగోలు చేసింది. దేశంలో వీడియో స్ట్రీమింగ్‌ కంటెంట్‌కు భారీగా డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో హాట్‌ స్టార్‌ వాటా కోసం ప్రయత్నిస్తోంది ఫ్లిప్‌కార్ట్. నెట్‌ ప్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలు కూడా ఇటీవల బాగా దూసుకుపోతుండటంతో ఈ రంగంలో ప్రవేశించాలని వాల్‌మార్ట్‌ భావిస్తోంది. 2015లో ట్వెంటీ ఫస్ట్‌ సెంచురీ ఫాక్స్‌కు చెందిన స్టార్‌ ఇండియా భారత్‌లో హాట్‌ స్టార్‌ను ప్రారంభించింది. హెచ్‌బీఓకు చెందిన పలు హిట్‌ సినిమాలతో పాటు ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లను లైవ్‌ స్ర్టీమింగ్‌లో అందిస్తోంది హాట్‌స్టార్‌.