ఫ్లిప్ కార్ట్ దివాలీ ధమాకా డేస్

ఫ్లిప్ కార్ట్ దివాలీ ధమాకా డేస్

మొన్న దసరాకి ఆన్ లైన్ లో కొనుక్కున్న వస్తువులు ఇంకా ఇంటికి చేరనైనా లేదు. ఈకామర్స్ కంపెనీలు దీపావళి సేల్ కి సిద్ధమైపోయాయి. అమెజాన్ వచ్చే వారం మరోసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తో ముందుకొస్తోంది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ కూడా 'ఫెస్టివ్ ధమాకా డేస్'తో దివాలీ సేల్‌కు రెడీ అయింది. ఫ్లిప్‌కార్ట్ అక్టోబర్ 24-27 వరకు నాలుగు రోజుల పాటు 'ఫెస్టివ్ ధమాకా డేస్' పేరుతో  సేల్ నిర్వహించనుంది. అన్ని ప్రముఖ ఉత్పత్తులపై ఆఫర్లు ఉంటాయని సంస్థ వెల్లడించింది. 

బిగ్ బిలియన్ డేస్ సేల్‌ మాదిరిగా కాకుండా ఈ ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివ్ ధమాకా డేస్‌లో తొలి రోజు నుంచే అన్ని ఉత్పత్తులపై సేల్ ప్రారంభం కానుంది. ఇక ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లకు ఈ ఆఫర్లు అక్టోబర్ 23 రాత్రి 9 గంటల నుంచే అందుబాటులోకి వస్తాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు డెలివరీ, కస్టమర్ కేర్ లలో ప్రాధాన్యతతో పాటు అదనంగా రివార్డ్ పాయింట్స్, ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు. స్మార్ట్‌ఫోన్లతోపాటు టీవీలు, ఇతర గృహోపకరణాలపై 70% వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ఆసుస్ ఇటీవల లాంచ్ చేసిన జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం1, జెన్‌ఫోన్ లైట్ ఎల్‌1 ఈ సేల్‌లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ కార్డులు, డెబిట్ కార్డుపై ఈఎంఐ, నో కార్ట్ ఈఎంఐ, ఫోన్‌పేపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లున్నాయి. ఏయే ప్రొడక్ట్స్‌పై ఎంతెంత డిస్కౌంట్లు ఇస్తామనేది ఫ్లిప్‌కార్ట్ ఇంకా ప్రకటించలేదు.