ఫ్లిప్‌కార్ట్ "మొబైల్స్ బొనాంజా" షురూ.. భారీ ఆఫర్లు..!

ఫ్లిప్‌కార్ట్ "మొబైల్స్ బొనాంజా" షురూ.. భారీ ఆఫర్లు..!

పండగ సీజన్‌లో స్పెషల్ ఆఫర్లతో అదరగొట్టి.. వినియోగదారులను ఆకట్టుకున్నాయి ఈ-కామర్స్ సంస్థలు.. మొబైల్స్‌తో పాటు గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, బట్టలు ఇలా తదితర వస్తువులపై డిస్కౌంట్ ఆఫర్లతో సేల్స్ పెంచుకున్నాయి. ఇక, ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ ఫోన్లపై స్పెషల్ సేల్ నిర్వహిస్తోంది.. "మొబైల్స్ బొనాంజా" పేరుతో మొబైల్ ఫోన్లను స్పెషల్ డిస్కౌంట్ ధరలకు అందిస్తోంది. ఈ సేల్ ఇవాళ ప్రారంభం కాగా.. ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ స్పెషల్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ50, రెడ్‌మీ కే20, కే20 ప్రొ, పోకో ఎఫ్1, రియల్‌మి 5, గూగుల్ పిక్సల్ 3ఏ, హానర్ 20 స్మార్ట్‌ఫోన్లు తగ్గింపు ధరలకే లభిస్తున్నాయి. ఇక సేల్‌లో నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలోనూ నచ్చిన ఫోన్‌ను అందుకునే అవకాశం ఉంది. ఇక ఐఫోన్ 7, ఐఫోన్ 11, ఐఫోన్ 11ప్రొ, ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్ ఫోన్లను కూడా స్పెషల్ డిస్కౌంట్లు ఉన్నాయి. మొత్తానికి ఈ డిస్కౌంట్ ఆఫర్లలో ఫోన్లపై రూ.500 నుంచి రూ.15000 వరకు తగ్గింపు ధరలకే సొంతం చేసుకునే అవకాశం ఉంది.