పోకో ఎఫ్1, గూగుల్ పిక్సెల్2 ఎక్స్ఎల్ పై బంపర్ తగ్గింపు

పోకో ఎఫ్1, గూగుల్ పిక్సెల్2 ఎక్స్ఎల్ పై బంపర్ తగ్గింపు

ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ తన కస్టమర్ల కోసం 2018 చివరి సేల్ ప్రారంభించింది. 26 నుంచి 29  డిసెంబర్ వరకు జరిగే ఫ్లిప్ కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ లో స్మార్ట్ ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లు, డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. మీరు కొత్త సంవత్సరంలో కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ సేల్ లో మీకు బంపర్ ఆఫర్ దొరుకుతోంది. మొబైల్స్ బొనాంజా సేల్ లో దాదాపుగా అన్ని స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్లు లభిస్తున్నాయి.ధరలో తగ్గింపుతో పాటు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ ట్రా ఎక్స్చేంజ్ వాల్యూ, బైబ్యాక్ గ్యారంటీ వంటి ఎన్నో ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ సేల్ లో యాపిల్, షావోమీ, రియల్ మి, మోటరోలా, వివో వంటి ప్రసిద్ధ కంపెనీలతో పాటు అనేక ఇతర కంపెనీ స్మార్ట్ ఫోన్లను బెస్ట్ ఆఫర్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ కోసం కంపెనీ ఎస్బీఐతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. సేల్ లో మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు ఇష్టమైన స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేస్తే మీకు వెంటనే 10% అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది.

పోకో ఎఫ్1
ఫ్లిప్ కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ లో పోకో ఎఫ్1 6జీబీ ర్యామ్/64జీబీ వేరియంట్ ని రూ.17,999కే కొనుగోలు చేయవచ్చు. 6జీబీ ర్యామ్/128జీబీ వేరియంట్ రూ.20,999కి, 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.25,999కి కొనుక్కోవచ్చు. దీంతో పాటు పోకో ఈ అన్ని డివైజెస్ పై రూ.2,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తోంది. లిక్విడ్ కూల్ టెక్నాలజీతో పాటు వచ్చే ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ పై పని చేస్తుంది. 6.18 అంగుళాల పుల్ హెచ్ డి డిస్ ప్లే ఉండే ఈ ఫోన్ లో ఫోటోగ్రఫీ కోసం 12 మెగాపిక్సెల్ + 5 మెగాపిక్సెల్ డ్యుయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. సెల్ఫీల కోసం ఇందులో 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

గూగుల్ పిక్సెల్2 ఎక్స్ఎల్ 
మీరు బెస్ట్ కెమెరా ఉండే స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకుంటే మీరు గూగుల్ పిక్సెల్2 ఎక్స్ఎల్ ను ఓసారి చూడాల్సిందే. గూగుల్ పిక్సెల్2 ఎక్స్ఎల్ 2017లో లాంచ్ అయింది. గూగుల్ విడుదల చేసిన ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ లో తగ్గింపు తర్వాత రూ.39,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇది ఆండ్రాయిడ్ ఓరియోపై పని చేస్తుంది. ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 64 బిట్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఇచ్చారు. 4జీబీ ర్యామ్/64జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చే ఈ ఫోన్ లో 6 అంగుళాల క్యూహెచ్ డి+ డిస్ ప్లే అమర్చారు. ఫోటోగ్రఫీ కోసం ఫోన్ లో 12.2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇందులో 3520 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తోంది. 

రియల్ మి2 ప్రో
రియల్ మి2 ప్రో అన్ని వేరియంట్స్ పై రూ.1,000 తగ్గింపు లభిస్తోంది. 4జీబీ ర్యామ్/64జీబీ మెమరీ వేరియంట్ రూ.14,990కి బదులు రూ.13,990కి, 6జీబీ/64జీబీ వేరియంట్ రూ.16,990కి బదులు రూ.15,990కి, 8జీబీ/128జీబీ మెమరీ వేరియంట్ రూ.18,990కి బదులు రూ.17,990కే కొనుగోలు చేయవచ్చు. వీటితో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పై చెల్లిస్తే మీకు 10% ఇన్ స్టెంట్ డిస్కౌంట్ (గరిష్ఠంగా రూ.1500) వస్తుంది.

నోకియా 6.1 ప్లస్ 
నోకియా 6.1 ప్లస్ స్మార్ట్ ఫోన్ కూడా అసలు ధర రూ.15,999 నుంచి రూ.1,000 తగ్గించి రూ.14,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఒక స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్. ఇందులో స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్ ఇచ్చారు. 4జీబీ/64జీబీ వేరియంట్ గా దీనిని ప్రవేశపెట్టారు.

ఆసుస్ జెన్ ఫోన్ లైట్ ఎల్1
మీరు ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే మీకు ఈ ఫోన్ సరిగ్గా సరిపోతుంది. ఈ ఫోన్ పై రూ.1,000 తగ్గింపు లభిస్తోంది. ఫోన్ ధర రూ.5,999. సేల్ లో దీనిని రూ.4,999కి కొనవచ్చు. ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, 3000ఎంఏహెచ్ బ్యాటరీ, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఇచ్చారు.

మోటరోలా వన్ పవర్
ఫ్లిప్ కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ లో మోటరోలా వన్ పవర్ స్మార్ట్ ఫోన్ పై కూడా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తోంది. 16ఎంపీ+5ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.15,999. సేల్ లో దీనిని రూ.14,999కే దక్కించుకోవచ్చు . ఈ ఫోన్ ని 4జీబీ/64జీబీ వేరియంట్ గా ప్రవేశపెట్టారు. ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వస్తోంది.

రియల్ మి2
ఒప్పో సబ్ బ్రాండ్ రియల్ మి నుంచి వచ్చిన రియల్ మి2 స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తోంది. రియల్ మి2 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల గురించి చెప్పుకొంటే 3జీబీ/32జీబీ వేరియంట్ వెల రూ.9,990. సేల్ లో దీనిని రూ.9,499కే కొనుగోలు చేయవచ్చు. 4జీబీ వేరియంట్ ధర రూ.11,990 నుంచి రూ.1,000 తక్కువగా రూ.10,990కే కొనుక్కోవచ్చు.

నోకియా 5.1ప్లస్
నోకియా 5.1ప్లస్ స్మార్ట్ ఫోన్ పై రూ.1,000 రాయితీ లభిస్తోంది. ఫోన్ ధర రూ.10,999 సేల్ లో దీనిని రూ.9,999కే కొనుగోలు చేయవచ్చు. ఫోన్ లో 3జీబీ/32జీబీ  ఇచ్చారు. 3060 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఈ స్మార్ట్ ఫోన్ 13+5 మెగాపిక్సెల్ డ్యుయల్ కెమెరా సెటప్ తో వస్తుంది.

ఇవి కాకుండా ఇంకా ఎన్నో స్మార్ట్ ఫోన్లు ఆకర్షణీయ తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. ఒప్పో ఎఫ్9 ప్రో, ఏ3ఎస్, ఎఫ్9 లపై కూడా సేల్ లో అదనపు ఎక్స్చేంజీ వాల్యూకి లభిస్తున్నాయి. మొబైల్స్ బొనాంజా సేల్ లో వీవోకి చెందిన వీవో 11 ప్రో, వీవో వై83, వీవో వీ9 యూత్ స్మార్ట్ ఫోన్స్ కొనుగోలుపై వేర్వేరు ఆఫర్లు ఇస్తున్నారు. వీటిలో ఎక్స్ ట్రా ఎక్స్చేంజ్ వాల్యూ ఆఫర్లు కూడా ఉన్నాయి.