ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ షాపింగ్ డేస్' షురూ

ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ షాపింగ్ డేస్' షురూ

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ షాపింగ్ డేస్‌' పేరుతో భారీ డిస్కౌంట్లు ప్రకటించింది... ఈ రోజు ప్రారంభమైన ఈ సేల్... ఈ నెల 16వ తేదీ వరకు అంటే నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. బిగ్ షాపింగ్ డేస్ పేరిట నిర్వహిస్తోన్న ఈ ఇయర్ ఎండింగ్ సేల్‌లో మొబైల్స్, ట్యాబ్లెట్స్, ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలు, ఫ్యాషన్, లైఫ్‌ స్టైల్‌, టీవీలు, హోమ్ అప్లయెన్సెస్, ఫర్నిచర్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు అందిస్తుండగా... ముఖ్యంగా మొబైల్ ఫోన్లు కొనాలనుకునేవారికి 'బిగ్ షాపింగ్ డేస్‌'లో భారీ డిస్కౌంట్ల అందిస్తోంది. 

నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న 'బిగ్ షాపింగ్ డేస్‌'లో హానర్ 9 లైట్, హానర్ 9ఐ, హానర్ 8 ప్రోపై భారీగా అంటే రూ. 7 వేల వరకు రాయితీలు మరియు 10 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తోంది. వివో వీ7, శాంసంగ్ గెలాక్సీ ఆన్ మ్యాక్స్, ఆన్ ఎన్‌ఎక్స్‌టీ 64జీబీ, హానర్ 9 లైట్, శాంసంగ్ ఎలాక్సీ ఆన్ ఎన్‌ఎక్స్‌టీ 16జీబీ, మోటో ఈ4 ప్లస్, పానాసోనిక్ ఎలూగా రే 700, ఇన్ఫినిక్స్ నోట్ 4, స్మార్ట్రన్ టి.ఫోన్ పి స్మార్ట్‌ఫోన్లపై ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలు అందిస్తోంది. టాబ్లెట్ పీసీలు, ల్యాప్‌టాప్‌లపై కూడా భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ఇన్ఫినిక్స్, ఒప్పో, శాంసంగ్, మోటో లాంటి సంస్థల మొబైల్స్‌పై భారీ ఆఫర్లు ఉండగా... ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిడ్, క్రిడిట్ కార్డులపై లావాదేవీలు చేస్తే అదనంగా 10 శాతం రాయితీ పొందొచ్చు.