25న ఫ్లిప్ కార్ట్ సూపర్ సేల్

25న ఫ్లిప్ కార్ట్ సూపర్ సేల్

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఈ నెల 25న ఒక రోజు సూపర్ సేల్ ని ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్స్ కోసం ఒక రోజు ముందుగానే అంటే 24న ఈ ఆఫర్స్ లభించనున్నాయి.  హెడ్ డీ ఎఫ్ సీ కార్డు ఉంటే మరో 10శాతం అధిక డిస్కౌంట్ లభించనుంది. అందుకు గాను వారు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేయాల్సి ఉంది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఆడియో డివైస్‌లు, కెమెరాలపై ఈ ఆఫర్‌ను అందిస్తున్నారు. రెడ్ మీ 5ఏ స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ సెలో  25న లభించనుంది. ఈ సేల్‌లో ప్రతి గంటకు పలు రకాల ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందివ్వనున్నారు. హోమ్ డెకార్, బ్యూటీ, క్లాతింగ్, యాక్ససరీలు ప్రొడక్ట్స్‌ను బెస్ట్ ప్రైస్‌కు అమ్మనున్నారు. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కుక్‌వేర్‌పై 40 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తారు. నైక్ , లీ లాంటి బ్రాండెడ్ దుస్తులు, ఫుట్ వేర్, ఆక్సరీస్ పై  30 నుంచి 80 శాతం డిస్కౌంట్ లభిస్తుందని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. స్మార్ట్ ఫోన్స్, గాడ్జెట్స్ పై ప్రతి ఎనిమిది గంటలకు సూపర్ డీల్స్ ప్రకటించనున్నారు.