ఫ్లిప్‌కార్ట్ చేతికి ప్ర‌ముఖ ట్రావెల్ సంస్థ‌..

ఫ్లిప్‌కార్ట్ చేతికి ప్ర‌ముఖ ట్రావెల్ సంస్థ‌..

ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్ త‌మ వ్యాపారాన్ని మ‌రింత విస్త‌రించ‌డంపై దృష్టిపెట్టింది..  ప్రముఖ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సంస్థ క్లియర్‌ ట్రిప్‌ను కైవ‌సం చేసుకుంది.. క్లియర్‌ ట్రిప్ సంస్థ‌లోని మొత్తం వాటాలను కొనుగోలు చేస్తున్న‌ట్టు వెల్ల‌డించింది ఫ్లిప్‌కార్ట్‌.. ఈ డీల్ విలువ ఎంత అనేదానిపై క్లారిటీ లేక‌పోయినా.. ర‌క‌రాల వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.. అయితే, ప్లిప్‌కార్ట్ మొత్తం షేర్లు కొనుగోలు చేసి నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను టేకోవ‌ర్ చేసినా.. క్లియర్‌ ట్రిప్‌ ప్రత్యేక బ్రాండ్‌గానే కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. 

ఇక‌, క్లియ‌ర్ ట్రిప్‌ను ఫ్లిప్‌కార్ట్ టేకోవ‌ర్ చేసినా.. ఆ సంస్థ ఉద్యోగులందరూ యథావిధిగా కొన‌సాగ‌నున్నారు.. వ్యాపార విస్త‌ర‌ణ‌, సంస్థ అభివృద్ధి కోస‌మే ఈ డీల్ అని స్ప‌ష్టం చేసింది ఫ్లిప్‌కార్ట్.. అయితే, ఈ డీల్ విలువ 40 మిలియన్‌ డాలర్లు ఉండవచ్చున‌నే అంచ‌నాలున్నాయి.. డిజిటల్‌ వేదికగా వినియోగదారులకు అద్భుతమైన అనుభూతినందించేందుకు కట్టుబడి ఉన్నాం. పర్యటనలకు క్లియర్‌ ట్రిప్‌ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఆ బ్రాండ్‌ను కొనసాగిస్తూనే, కొత్త ప్రాంతాల్లో సంస్థను వృద్ధి చేస్తాం అంటోంది ఫ్లిప్‌కార్ట్‌..