ఫ్లిప్ కార్ట్ ఉమెన్స్ డే సేల్..భారీ ఆఫర్లు..

ఫ్లిప్ కార్ట్ ఉమెన్స్ డే సేల్..భారీ ఆఫర్లు..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఉమెన్స్‌ డే సేల్‌ పేరుతో ఈ నెల 7, 8 తేదీల్లో స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, పలు రకాల గాడ్జెట్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 8, నోకియా 6.1 ప్లస్‌, హానర్‌ 9ఎన్, హానర్‌ 9లైట్‌, హానర్‌ 7ఏ, మోటో వన్‌ పవర్‌, వివో వి9 ప్రో లాంటి మోడళ్లపై డిస్కౌంట్లను ఆఫర్‌  చేస్తోంది. వీటితోపాటు లాప్‌టాప్స్‌, హెడ్‌ఫోన్స్‌, స్పీకర్స్‌, కెమెరాలు, పవర్ బ్యాంక్స్‌పై 80 శాతం వరకు భారీ డిస్కౌంట్‌ను అందించనుంది. 

జెన్‌ఫోన్ 5జడ్‌పై రూ.3 వేలు, జెన్‌ఫోన్ లైట్ ఎల్1పై రూ.1,000, జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం1, జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1పై రూ.500 చొప్పున రాయితీ ప్రకటించింది. షియోమీ రెడ్‌మీ నోట్ 6 ప్రొ (4జీబీ ర్యామ్, 64 జీబీ)ను రూ.10,999, పోకో ఎఫ్1 (6జీబీ, 64 జీబీ.. 6జీబీ, 128 జీబీ)ను కొనుగోలు చేసే వారికి పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్‌పై అదనంగా రూ.2 వేల వరకు రాయితీ ఇస్తోంది. పోకో ఎఫ్ 1 (8 జీబీ ర్యామ్, 256 జీబీ)ని కొనుగోలు చేసే వారికి ఎక్స్ఛేంజ్‌పై రూ.3 వేల వరకు రాయితీని అందిస్తోంది. వీటితోపాటు వివో వి11, ఒప్పో ఎఫ్9లపైనా రూ.3 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అవకాశం కల్పించారు.