ఫ్లోటింగ్ రెస్టారెంట్లు వచ్చేశాయి

ఫ్లోటింగ్ రెస్టారెంట్లు వచ్చేశాయి

నీటిపై తేలియాడే రెస్టారెంట్లు మనదగ్గర కూడా వచ్చేశాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముంబైలో 2 తేలియాడే రెస్టారెంట్లను ప్రారంభించారు. గేట్ వే ఆఫ్ ఇండియా, మెరైన్ డ్రైవ్ వద్ద ఈ రెస్టారెంట్లు పని చేస్తాయి. వాటి పేర్లు నెవర్ ల్యాండ్, సీ యా. ఒకేసారి 450 మంది ఈ రెస్టారెంట్లలో విందులు ఆరగించవచ్చు. పార్టీలు చేసుకోవచ్చు. ఇద్దరికి కలిపి రూ. 5 వేలు చార్జ్ చేస్తారు. 

ఇప్పటివరకు ఫ్లోటింగ్ రెస్టారెంట్లు విదేశాల్లో ఉన్నాయని విన్నాం.  తాజాగా అలాంటి హోటల్లే మన దేశంలో కూడా అడుగు పెట్టినట్టయింది.