కుమారస్వామికి రేపే బలపరీక్ష

కుమారస్వామికి రేపే బలపరీక్ష

ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో.. కన్నడనాట రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సరిగ్గా వారం కిందట కర్ణాటక అసెంబ్లీలో ఏం జరిగిందో.. తిరిగి అలాంటి పరిస్థితే రేపు మరలా ఆ రాష్ట్ర శాసనసభలో జరగనుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామి రేపు తన ప్రభుత్వానికి బలనిరూపణ చేసుకోనున్నారు. ప్రస్తుతం కుమారస్వామికి 116 మంది ఎమ్మెల్యేల బలం ఉంది... ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి 112 మంది ఎమ్మెల్యేలు చాలు.. మరోవైపు ప్రతీకారం తీర్చుకోవాలని బీజేపీ రగిలిపోతోంది. రేపు బలపరీక్ష సందర్భంగా ఒక్క ఆరుగురు ఎమ్మెల్యేలు అడ్డం తిరిగినా కథ మళ్లీ మొదటికొస్తుంది.. ఈ నేపథ్యంలో ఇరుపక్షాలు తమ క్యాంపులను కొనసాగిస్తున్నాయి. కుమారస్వామి మూడు రోజుల ముఖ్యమంత్రిగా మారిపోతారా.? లేక ఐదేళ్ల సీఎంగా ఉంటారా.. అన్నది తెలియాలంటే మరికొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.