ఆకాశంలో మే 7 న మరో అద్భుతం... మూడు రోజులపాటు దర్శనం... 

ఆకాశంలో మే 7 న మరో అద్భుతం... మూడు రోజులపాటు దర్శనం... 

మే 7 వ తేదీన బుద్ధపూర్ణిమ.  పౌర్ణమి రోజున ఆకాశంలో నిండు చంద్రుడు దర్శనం ఇస్తుంటాడు.  పౌర్ణమి రోజున మాత్రమే ఫుల్ మూన్ దర్శనం ఇస్తుంది.  అయితే, ఈ ఏడాది ఆకాశంలో ఓ అద్భుతం జరగబోతున్నట్టు నాసా ధ్రువీకరించింది.  బుద్ధ పూర్ణిమ రోజైన మే 7 వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఆకాశంలో ఫుల్ మూన్ దర్శనం ఇవ్వబోతున్నది.  మే 7 వ తేదీ నుంచి మే 10 వ తేదీ వరకు పౌర్ణమి చంద్రుడిలా దర్శనం ఇవ్వబోతున్నాడు.  

ఇది ఓ విధంగా అద్భుతం అని చెప్పాలి.  బుద్ధపూర్ణిమ రోజున వచ్చే చంద్రుడిని ఫుల్ మూన్, బ్లడ్ మూన్ అనే పేరుతో పిలుస్తుంటారు.  కానీ, ఈసారి ఆకాశంలో దర్శనం ఇవ్వబోతున్న చంద్రుడికి ఫ్లవర్ మూన్ గా పేర్కొంటున్నారు.  పువ్వులు వికసించే కాలంలో ఆకాశంలో చంద్రుడు మూడు రోజులపాటు దర్శనం ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ పేరు పెట్టినట్టు సమాచారం.  చంద్రుడు భూమికి మరింత దగ్గరకు వస్తున్నందువలన ఇలా మూడు రోజులపాటు ఫుల్ మూన్ దర్శనం ఇవ్వబోతున్నట్టు నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  1979 తరువాత భూమికి దగ్గరగా ఉన్న పెఱిగి కక్ష్యలోకి చంద్రుడు వచ్చినట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.