బల్దియా ఓటర్లు ఎటు వైపు ?
ఎన్నడూ లేని విధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఈసారి ఆసక్తిగా మారాయి. 150 డివిజన్లలో పోరు హోరాహోరీగా ఉంది. గెలుపు గుర్రాలు ఎవరో రేపు తీర్పు చెప్పబోతున్నారు బల్దియా ఓటర్లు. గతంలో ఎవరు నెగ్గారు.. ఇప్పుడు ఎవరిని ఎన్నుకుంటారు అన్నది ఆసక్తిగా మారింది. అందరి దృష్టీ ఓల్డ్ సిటీపైనే ఉంది. అలాగే న్యూ సిటీ.. నగర శివారు ప్రాంతాల్లోని డివిజన్లలోనూ ఓటర్లు తీర్పు ఏంటన్నది ఉత్కంఠ నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐదు లోక్‌సభ స్థానాలు.. 23 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 150 డివిజన్లు వీటి పరిధిలోకే వస్తాయి. అక్కడ ఎన్నికల వాతావరణం ఎలా ఉంది.. ఏంటో ఇప్పుడు చూద్దాం.
హైదరాబాద్ ఓల్డ్ సిటీ (మొత్తం డివిజన్లు 54) : ఓల్డ్ సిటీ (54)లో 2016లో పార్టీలు గెలుచుకున్నవి
MIM 35, TRS 7, BJP 2
ఈసారి స్థానాల్లో MIM పాగా వేస్తుంది...బీజేపీ పుంజుకుంటుందా? పాత బస్తీలో టీఆర్ఎస్ బలం పెరుగుతుందా? తగ్గుతుందా? అందరి దృష్టీ పాత బస్తీ పైనే ఉంది.
చేవెళ్ల లోక్‌సభ( డివిజన్లు 17) : చేవెళ్ల లోక్‌సభ పరిధిలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు
మహేశ్వరం: డివిజన్లు -2, రాజేంద్రనగర్: డివిజన్లు- 5, శేరిలింగంపల్లి: డివిజన్లు- 10
చేవెళ్ల లోక్‌సభ పరిధిలోకి వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో ఒకప్పుడు కాంగ్రెస్ బలంగా ఉండేది. అలాంటిది గత ఆరేళ్లగా కాంగ్రెస్ ఉనికే లేదు. గతంలో రెయ్మని దూసుకెళ్లిన సైకిల్ సైతం ఉనికిలో లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ డివిజన్లలో టీఆర్ఎస్.. బీజేపీ మధ్య ఫైట్ ఆసక్తిగా ఉం ది.
మెదక్ లోక్‌సభ, డివిజన్లు 3
మెదక్ లోక్‌సభ పరిధిలో 1 అసెంబ్లీ నియోజకవర్గం
పటాన్చెరు : డివిజన్లు 3
హైదరాబాద్ శివారు BHEL నుంచి పటాన్చెరు వరకు విస్తరించింది ఈ ప్రాంతం. ఇక్కడ కార్మికుల ఓట్లు ఎక్కువ. ఇటీవల ఐటీ ఉద్యోగుల సంఖ్య కూడా ఈ ప్రాంతంలో పెరిగింది. పైగా మెదక్ జిల్లాకు ముఖద్వారం. ఈ మూడు డివిజన్లలో పార్టీల సత్తా ఏంటన్నది ఆసక్తిగా ఉం ది.
హైదరాబాద్ లోక్‌సభ, డివిజన్లు 50,
హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు
నాంపల్లి : డివిజన్లు 7, కార్వాన్: డివిజన్లు 6, యాకత్పురా: డివిజన్లు 8, మలక్‌పేట్: డివిజన్లు 6, గోషామహల్: డివిజన్లు 6, చాంద్రాయణగుట్ట: డివిజన్లు 7
చార్మినార్: డివిజన్లు 4, బహదూర్‌పురా: డివిజన్లు 6,
ఇది పూర్తిగా ఓల్డ్ సిటీ. ఎంపీ, ఎమ్మెల్యేలు అంతా మజ్లిస్‌కు చెందిన వారే. ఇప్పుడు ప్రాంతంలోకి చొచ్చుకెళ్లాలని చూస్తోంది బీజేపీ. మరి.. ఎంఐఎం పట్టు నిలుపుకొంటుందా.. బీజేపీ బలం పెంచుకుంటుందా అన్న ప్రశ్నలు GHMC ఎన్నికల్లో కీలకంగా మారాయి.
మల్కాజ్గిరి లోక్‌సభ : డివిజన్లు 46
మల్కాజ్గిరి లోక్‌సభ పరిధిలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు
ఉప్పల్: డివిజన్లు 10, ఎల్బీనగర్: డివిజన్లు 11, కుత్బుల్లాపూర్: డివిజన్లు 8, మల్కాజ్గిరి : డివిజన్లు 9, కూకట్పల్లి : డివిజన్లు 8
మల్కాజ్‌గిరిలో ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీ ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో గతంలో టీఆర్ఎస్దే పట్టు. ఇప్పుడు నేనున్నాను అంటోంది బీజేపీ. మరి... గ్రేటర్ రేస్‌లో ఈ మూడు పార్టీలు ఏ స్థానంలో ఉంటాయో చూడాలి.
సికింద్రాబాద్ లోక్‌సభ : డివిజన్లు 34
సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలు
అంబర్‌పేట: డివిజన్లు 5, సికింద్రాబాద్: డివిజన్లు 5, ముషీరాబాద్: డివిజన్లు 6, సనత్‌నగర్: డివిజన్లు 6, జూబ్లీహిల్స్: డివిజన్లు 6, ఖైరతాబాద్: డివిజన్లు 6
సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎంపీగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఉన్నారు. బల్దియా ఎన్నికలు ప్రస్తుతం ఆయనకు సవాల్ విసురుతున్నాయి. తన లోక్‌సభ పరిధిలో బీజేపీకి ఎక్కువ డివిజన్లు సాధించిపెట్టడం కిషన్‌రెడ్డికి పెద్ద పరీక్షగానే భావించారు. అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా ఇక్కడ గట్టి వర్కవుటే చేసింది. చూడాలి మరి ఏమవుతుందో ?
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)