రాష్ట్రంలో పొడి వాతావరణం

రాష్ట్రంలో పొడి వాతావరణం

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెండు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో రాత్రి, ఉదయం సమయాల్లో పొగమంచు ఏర్పడే అవకాశం అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి. అంతకుముందు 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. ప్రస్తుతం 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌లో 10 డిగ్రీలు, మెదక్‌లో 13, హన్మకొండలో 15, ఖమ్మంలో 16, భద్రాచలంలో 17, నల్లగొండలో 17, మహబూబ్‌నగర్‌లో 19 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.