'తుఫాన్ వల్ల ఈవీఎంలకు ఇబ్బంది ఉండదు'

'తుఫాన్ వల్ల ఈవీఎంలకు ఇబ్బంది ఉండదు'

ఫొని తుఫాన్ సమయంలో ఎన్నికల కోడ్ నుంచి  వెసులుబాటు కల్పించాలనే ప్రతిపాదన ప్రభుత్వం నుంచి రాలేదని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది చెప్పారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో కోడ్ వెసులుబాటు కావాలంటే రాష్ట్రం నుంచి సీఈసీకి ప్రతిపాదనలు వెళ్లాలని.. ప్రభుత్వం నుంచి ఏ ప్రతిపాదనలు వచ్చినా సీఈసీ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కోడ్ మినహాయింపు, కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం సీఈసీకే ఉంటుందన్న ఆయన..సీఈసీ ఆదేశాలను తాము అమలు చేస్తామన్నారు. తుఫాన్ వల్ల స్ట్రాంగ్ రూముల్లోని ఈవీఎంలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, విజయనగరం, శ్రీకాకుళం కలెక్టర్లను అప్రమత్తం చేశామని ద్వివేది తెలిపారు.