ఆ గుహ అద్దె రోజుకు రూ. 990

ఆ గుహ అద్దె రోజుకు రూ. 990

కేదార్‌నాథ్‌ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ధ్యానం చేసిన గుహ గురించి జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. వై ఫైతో పాటు పలు  ఆధునిక సౌకర్యాలు ఉన్న ఈ గుహ గురించి మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. ప్రధాని మోడీ సలహా మేరకు గత ఏడాది గర్వాల్‌ మండల్‌ వికాస్‌ నిగమ్‌ (జీఎంవీఎన్‌) సంస్థ ఈ గుహలను ఏర్పాటు చేసింది. ప్రజల్లో ముఖ్యంగా భక్తుల్లో ధ్యానం పట్ల మక్కువ పెంచే ఉద్దేశంతో ప్రధాని వీటిని నిర్మించమన్నారు. గత ఏడాది నుంచి  ఈ గుహలు అందులో ఉన్నా... జనం నుంచి పెద్దగా ఆగరణ లభించలేదు. తొలుత ఈ గుహ రోజు అద్దె రూ. 3,000గా ఉండేది. ఎవరూ పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఇపుడు రోజుకు రూ. 990 వసూలు చేస్తున్నారు. కేదార్‌నాథ్‌ ప్రధాన దేవాలయం నుంచి ఒక కిలో మీటర్‌ దూరంలో వీటిని ఏర్పాటు చేశారు. ప్రధాని ఇక్కడ స్వయంగా ధ్యానం చేయడంతో వీటికి మున్ముందు డిమాండ్‌ పెరుగుతుందని భావిస్తున్నట్లు జీఎంవీఎన్‌ అధికారులు అంటున్నారు.