అచ్చంగా అవి ఇవీ..ఒకేలా..తోడుగా

అచ్చంగా అవి ఇవీ..ఒకేలా..తోడుగా

ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు వారి ఆహారపు అలవాట్లు ఎంతగానో దోహదం చేస్తాయి. సమతుల ఆహారం తీసుకోవటం అన్నది ఇందులో చాలా ముఖ్యం. ఈ సమతుల ఆహారంలో కూరగాయలు ఎంతగానో ఉపయోగపడుతాయి. ఆరోగ్య రక్షణకు ప్రతిరోజూ కూరగాయలు తీసుకోవటం ముఖ్యమని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. మనం తీసుకునే ఆహారంపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుదని ఎప్పటి నుంచో డాక్టర్లు అంటున్నమాట. మానవ శరీరంలో ఏ కూరగాయ ఎంతవరకు ఉపయోగపడు తుందనేదానిపై  అనేక పరిశోధనలు జరిగాయి.  మనకు పోషకాలు అందించే శరీర భాగాలను ప్రతిబింబించే ఆహార పదార్థాలు కొన్ని.   వాటిలో కొన్ని మీకోసం ..

క్యారెట్ కళ్లకు ఎంతగానో మేలు చేస్తోంది. కంటిచూపు బాగా ఉండేందుకు క్యారెట్‌ చాలా సాయం చేస్తుంది.మనం తినే ఆహారంలో రోజు క్యారెట్ ముక్కలు ఉండేలా చూసుకుంటే.. కళ్ల వ్యాధులకు దూరంగా ఉన్నట్లే. క్యారెట్ కోసి చూస్తే... లోపల భాగం కన్నునే పోలి ఉంటుంది. ఇది యాదృచ్ఛికమే అయినా.... కంటికి, క్యారెట్ కు ఉన్న సంబంధాన్ని తెలియజేస్తోంది.  ఇందులో బీటా-కరోటిన్ వంటి విటమిన్లు అధికంగా ఉంటాయి. కళ్ళు ఆరోగ్యకరంగా ఉండేందుకు ఇవి చాలా కీలకం. వృద్ధుల దృష్టి మందగించకుండా ఇది రక్షిస్తుంది.

వాల్నట్ మెదడుకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. వాల్నట్ లోని లోపలి భాగం ముడతలు కూడా మెదడులో ఉండే ముడతలను పోలి ఉంటుంది. వాల్నట్ ఆకారం కూడా మనిషి మెద‌డును పోలి ఉంటుంది. వాల్నట్ కు బ్రెయిన ఫుడ్ అనే నిక్ నేమ్ కూడా ఉంది. మెదడు పనితీరుకు సహాయపడే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఇందులో ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. 


కొత్తిమీర కాడలు (సిలరీ) ఎముకలకు ఉపయోగపడుతాయి. సెలయేర్ యొక్క పొడవాటి, లీన్ కాండాలు ఎముకలు వలె కనిపిస్తాయి. సెలేరీ సిలికాన్ యొక్క ఒక గొప్ప మూలం, ఇది ఎముకలు వాటి శక్తిని ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది. ఎముకలు 23 శాతం సోడియాన్ని కలిగి ఉంటాయి. సెలెరీ కూడా అదేస్థాయిలో సోడియం కలిగి ఉంటుందని పరిశోదనల్లో తేలింది. 

అవోకాడోస్ గర్భాశయానికి ఉపయోగ పడుతుంది. అవోకాడోస్ లైట్ బాల్  ఆకారం కూడా గర్భాశయంలాగానే  కనిపిస్తోంది. అవోకాడోస్ పునరుత్పాదక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యాన్ని కూడా బలపరుస్తుంది. ఫోలిక్ ఆమ్లం గని అవోకాడోస్ అంటారు. అవోకాడోస్  సర్వైవల్ డిస్ ప్లేసియా లాంటి ఆసాధరణ పరిస్థితి నుంచ కాపాడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. 


క్లామ్స్(నత్తలు) వృషణాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయని పరిశోధనల్లో తేలింది. ఫోలిక్ ఆమ్లం , జింక్ క్లామ్స్ అధికంగా ఉంటాయనీ, ఇవి మగవారిలో సెక్స్ సామార్థాన్ని పెంచుతాయని నెదర్లాండ్స్ లో నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. పురుషుల్లో వీర్యం నాణ్యతను మెరుగుపరుచుకోవడంలో గణనీయమైన ప్రభావం చూపుతూయాని డాక్టర్లు చెబుతున్నారు. 


సిట్రస్ జాతికి సంబంధించిన నిమ్మ, ద్రాక్షపండు వంటి పండ్లు వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయ‌ని పరిశోదనలో తేలింది. వీటిలో లెమొనాయిడ్స్   పుష్కలంగా ఉంటాయి. ఇవి  రొమ్ము కణాల్లో క్యాన్సర్ అభివృద్ధిని నిరోధిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.


ఇక టమోటా ఉపయోగం అంతా ఇంతకాదు. ముఖ్యంగా ఇది గుండె సంబంధింత వ్యాధుల నుంచి రక్షించేందుకు టమోటా చాలాఇక టమోటా ఉపయోగం అంతా ఇంతాకాదు. ముఖ్యంగా ఇది గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షించేందుకు చాలా ఉపయోగపడుతుందని పరిశోదనల్లో తేలింది. టమోటా కోస్తే గుండె ఆకారం క‌న్పిస్తుంది. గుండెలో ఉన్నట్లే ఇందులో కూడా గదులు ఉంటాయి. టమోటాల్లోని లైకోపీన్ కారణంగా, పురుషులు, మహిళల్లో గుండె జబ్బులు తగ్గుతున్నాయని అధ్యయనాల్లో తేలింది 

రెడ్ వైన్ లో యాంటీ ఆక్సిడెంట్లు,  పాలిఫేనోల్స్ సమృద్ధిగా లభిస్తాయి.  గుండె వ్యాధికి కారణమయ్యే ఎల్‌డీఎల్ కొలెస్టరాల్ వంటివాటికి వ్య‌తిరేకంగా రెడ్‌వైన్‌ ప‌నిచేస్తుంది.   రెడ్ వైన్ రక్తం గ‌డ్డకట్టకుండా చూస్తుంది. దీంతో గుండెనొప్పి , గుండె జబ్బుల భారిన పడకుండా రెడ్ వైన్ కాపాడుతుందని పరిశోధ‌నల్లో తేలింది. 

అల్లం ముక్క పొట్ట, జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. మనం తీసుకునే ఆహారంలో అల్లం ఉండేటట్లు చూసుకుంటే అజీర్ణంతో బాధపడాల్సిన అవసరం రాదని డాక్టర్లు చెబుతారు. అల్లం ముక్కలు కూడా కొంతవరకు జీర్ణ అవయవాన్ని పోలి ఉంటుంది. అల్లం యొక్క గాఢమైన సువాసన, రుచికి కారణమవుతోంది. అందులోని జిన్గోల్ అనే పదార్థానికి వాంతులు, విరోచనాలనూ నిరోధించే శక్తి ఉంటుందని పరిశోధనలో తేలింది. 


 ప్యాంక్రియాసిస్‌ను వ్యాధుల నుంచి చిలగడ దుంప రక్షిస్తుంది.  రెండూ రూపంలో కూడా ఒకే పోలికను కలిగి ఉంటాయి. ప్యాంక్రియాసిస్‌ ఆరోగ్యకరంగా ఉండేలా ఈ దుంప సహకరిస్తుంది. క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది. ఇందులో బీటా-కరోటిన్‌లో అధికంగా ఉంటాయి.