మ్యాచ్‌ మధ్యలో పిడుగుపాటు.. ఆటగాడు మృతి..

మ్యాచ్‌ మధ్యలో పిడుగుపాటు.. ఆటగాడు మృతి..

పిడుగుపాటు ఓ యువ ఆటగాడి ప్రాణాలు తీసింది... ఈ విషాద ఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలో జరిగింది... పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుమ్లా జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత మారుమూల ప్రాంతంలో ఉన్న ఉరుబార్డి గ్రామంలో.. నెమాన్‌ కుజుర్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా మ్యాచ్‌ నిర్వహించారు. అయితే, మ్యాచ్‌ జరుగుతోన్న సమయంలో వర్షం మొదలైంది.. ఇంతలో పెద్ద శబ్దంతో పిడుగు పడింది. ఈ ఘటనలో యువ ఆటగాడు పరాస్‌ పన్నా మృతిచెందారు.. పిడుగుపాటుకు పరాస్ పన్నాతో పాటు మరో నలుగురు గాయపడగా.. వారిని గుమ్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరాస్‌ పన్నా మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ఇక, ఈ ఘటన గురువారం జరగగా... కొంత ఆలస్యంగా.. శుక్రవారం పోలీసులకు సమాచారం అందింది.. గ్రామాన్ని సందర్శించిన పోలీసులు.. కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా మ్యాచ్‌ నిర్వహించడంపై ఆరా తీశారు. మ్యాచ్‌ జరుగుతోన్న సమయంలో పిడుగుపాటుతో ఆటగాడు ప్రాణాలు పోవడం విషాదాన్ని మిగిల్చింది.