ధోనీ, స‌చిన్‌లను దాటేసిన‌ కోహ్లీ

ధోనీ, స‌చిన్‌లను దాటేసిన‌ కోహ్లీ

ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ -100 జాబితాలో భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్ లు చోటు దక్కించుకున్నారు. అత్యధికంగా ఆర్జిస్తోన్న భారత సెలబ్రిటీల జాబితాను మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితాలో కోహ్లీ, ధోనీ, సచిన్ లు టాప్-10లో ఉన్నారు. ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ -100 జాబితాలో కోహ్లీ రూ.228.09 కోట్ల  సంపాదనతో రెండో స్థానం దక్కించుకున్నాడు. ధోనీ రూ.101.77 కోట్లతో ఐదో స్థానంలో.. సచిన్ రూ.80 కోట్లతో తొమ్మిదవ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో రూ.253.25 కోట్లతో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మొదటి స్థానం దక్కించుకున్నాడు.