ఆ జాబితాలో టాప్-100 లో కోహ్లీ ఒక్కడే... 

ఆ జాబితాలో టాప్-100 లో కోహ్లీ ఒక్కడే... 

ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందుతున్న అథ్లెట్ల జాబితాను ఫోర్బ్స్ శుక్రవారం వెల్లడించింది. అయితే ఇందులో గత ఏడాది లాగే భారత అథ్లెట్ల నుండి కేవలం ఒక కోహ్లీ మాత్రమే నిలిచాడు. 196 కోట్ల ఆదాయంతో 66 స్థానంలో నిలిచాడు భారత కెప్టెన్.అయితే పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు 34 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు కోహ్లీ. అయితే ఈ జాబితాలో 801 కోట్లతో అగ్రస్థానంలో నిలిచాడు రోజర్ ఫెదరర్. అయితే గత ఏడాది కంటే నాలుగు స్థానాలు ఎగబాకి, టెన్నిస్ క్రీడ నుండి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఇక ఫుట్ బాల్ ఆటగాళ్ళు క్రిస్టియానో ​​రొనాల్డో (794 కోట్లు), మెస్సీ (786 కోట్లు) మరియు నేమార్ (721 కోట్లు) మరియు అమెరికన్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు లెబ్రాన్ జేమ్స్ (666 కోట్లు) మొదటి ఐదు స్థానాల్లో నిలిచారు. ఈ జాబితాలో ఒసాకా, విలియమ్స్ ఇద్దరు మహిళలు మాత్రమే  ఉన్నారు. బాస్కెట్‌బాల్ క్రీడాకారులు టాప్ 100 లో 35 మంది ఉన్నారు.