హైదరాబాద్‌లో విదేశీ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌లో విదేశీ విద్యార్థి ఆత్మహత్య

‌తాను పెళ్లి చేసుకోబోయే యువతి మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక యెమన్‌ దేశానికి చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. యెమన్‌ దేశానికి చెందిన మహ్మద్‌ ఒత్మాన్‌ అలీ కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం అలీకి తమ దేశానికి చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. పెళ్లి తేదీని కూడా ఖరారు చేశారు. ఐతే.. ఇటీవల ఆ యువతి కేన్సర్‌తో మృతి చెందింది. తీవ్రంగా కలత చెందిన అలీ.. తానుండే గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడు రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 'నా భార్యను దేవుడి దగ్గర కలుసుకుంటా'నంటూ ఇంగ్లీష్‌లో ఆ సూసైడ్‌ నోట్‌లో రాశాడు.