పడవ బోల్తా...ఆ ఇద్దరు ఫారెస్ట్ బీటాఫీసర్లు మృతి

పడవ బోల్తా...ఆ ఇద్దరు ఫారెస్ట్ బీటాఫీసర్లు మృతి

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం గూడెం సమీపంలోని ప్రాణహిత నదిలో ఆదివారం నాటుపడవ మునిగి ఇద్దరు ఫారెస్ట్ బీట్ అధికారులు (ఎఫ్‌బీవో) గల్లంతయిన సంగతి తెలిసిందే. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. విధి నిర్వహణలో భాగంగా కర్జెల్లి అటవీ ప్రాంతం పరిధిలోని కేతిని బీట్ అధికారి బాలకృష్ణ, చిత్తా బీట్ అధికారి సురేశ్, శివపెల్లి బీట్ అధికారి సద్దాం మహారాష్ట్ర సరిహద్దులోని అహేరికి నాటుపడవలో వెళ్లారు. అయితే గల్లంతైన ఇద్దరు ఫారెస్ట్ బీటాఫీసర్లు చనిపోయారు. బీట్‌ ఆఫీసర్లు బాలకృష్ణ, సురేష్‌ నదిలో మిస్సవడంతో వీరికోసం నిన్నటి నుంచి గాలింపు జరిగింది. ఈరోజు మృతదేహాలను.. ఎన్డీఆర్ఎఫ్‌ టీమ్‌ గుర్తించింది. ఫారెస్టాఫీసర్లు కర్జవెల్లి రేంజ్‌కు చెందినవారు. నాటుపడవలో ప్రయాణిస్తుండగా నిన్న ఈ ప్రమాదం జరిగింది. నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.