ఫారెస్‌ ఆఫీసర్‌ అనిత సంచలన వ్యాఖ్యలు..

ఫారెస్‌ ఆఫీసర్‌ అనిత సంచలన వ్యాఖ్యలు..

విధుల్లో ఉన్న తనపై దాడి చేసిన ఎమ్మెల్యే కోనేరు కృష్ణప్ప సోదరుడు కృష్ణారావు నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ అనిత అన్నారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడారు. విధుల్లో భాగంగానే సిబ్బందితో కాలిసి సార్సాల గ్రామానికి వెళ్లామని.. అక్కడ తమను గ్రామస్థులు అడ్డుకోవడంతో పోలీసులు సర్ధిచెప్పేందుకు ప్రయత్నించారని అన్నారు. ఇంతలో కోనేరు కృష్ణారావు అనుచరులతో కలిసి వచ్చి పోలీసులను తోసిసే తమపై దాడి చేశారని చెప్పారు. 

కొట్టొద్దని వేడుకున్న వినలేదని, పశువులను కొట్టినట్టు తమపై దాడి చేశారని ఆమె వాపోయారు. ఎప్పటి నుంచో ఆ గ్రామంలో రాజకీయ నాయకుల గూండాయిజం ఉన్నదని ఆరోపించిన అనిత.. నేతల అండదండలతోనే దాడులు జరుగుతున్నాయన్నారు. తాను అస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక తనను ఏం చేస్తారోనని భయపడుతున్నానని, తనకు ఏదైనా జరగక ముందే కోనేరు కృష్ణారావుపై చర్యలు తీసుకోవాలని కోరారు.