ఆల్ టైమ్ క‌నిష్ఠానికి రూపాయి ప‌త‌నం

ఆల్ టైమ్ క‌నిష్ఠానికి రూపాయి ప‌త‌నం

అమెరికా ఆర్థ‌క వ్య‌వ‌స్థ గురించి ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ ఛైర్మ‌న్ పావెల్ చేసిన వ్యాఖ్య‌ల‌తో డాల‌ర్ ఏడాది గ‌రిష్ఠ స్థాయికి చేరింది. అదే స‌మ‌యంలో బాండ్ ఈల్డ్స్ కూడా కొన్నేళ్ళ గ‌రిష్ఠ స్థాయికి చేరాయి. పైగా ఈక్వీటీ మార్కెట్లు చాలా బ‌ల‌హీనంగా ఉండ‌టంతో విదేశీ మార‌క ద్ర‌వ్య మార్కెట్‌లో డాల‌ర్తో రూపాయి విలువ ఆల్‌టైమ్ క‌నిష్ఠ స్థాయి 69.05కి ప‌డిపోయింది. గ‌త నెల 28న 69.10కి క్షీణించినా.. ఆర్‌బీఐ జోక్యంతో వెంట‌నే కోలుకుంది. ఇవాళ మార్కెట్‌లో ఆర్‌బీఐ జోక్యం చేసుకోలేద‌ని, అందుకే ఈ ఒక్క రో్జూ రూపాయి 43 పైస‌లు క్షీణించింద‌ని ఫారెక్స్ మార్కెట్ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి విదేశీ ఇన్వెస్ట‌ర్లు భార‌త స్టాక్ మార్కెట్ నుంచి వైదొలుగుతున్నారు. దీంతో డాల‌ర్‌కు డిమాండ్ ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. పైగా అమెరికా బాండ్ల‌పై ఈల్ల్డ్ 2.624కి చేర‌డంతో అమెరికా ఇన్వెస్ట‌ర్లు వ‌ర్ధ‌మాన దేశాల మార్కెట్ల నుంచి త‌మ నిధుల‌ను వెన‌క్కి తీసుకుని... అమెరికా బాండ్లు కొనుగో్లు చేస్తున్నారు. దీంతో దేశీయ క‌రెన్సీల‌కు డిమాండ్ త‌గ్గింది. ఈ నేప‌థ్యంలో ఆర్‌బీఐ కూడా మార్కెట్‌కు దూరంగా ఉండ‌టంతో ప‌త‌నం చాలా వేగంగా ఉంది.