ముంబైలో మరణించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్...

ముంబైలో మరణించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్...

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్(59) ముంబైలో గుండెపోటుతో ఈ రోజు మరణించాడు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లకు కామెంటేటర్ వ్యవహరిస్తున్నారు ఆయన. 1984-1992 మధ్య 8 సంవత్సరాల పాటు అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగిన డీన్ జోన్స్ ఆస్ట్రేలియా తరఫున 52 టెస్టులు మరియు 164 వన్డేలు ఆడాడు. అయితే టెస్ట్ లో జోన్స్ మొత్తం 3,631 పరుగులు చేయగా అందులో 11 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే వన్డేల్లో 6,068 రన్స్ సాధించగా అందులో 7 శతకాలు, 46 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 245 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన జోన్స్ 55 సెంచరీలు మరియు 88 అర్ధ సెంచరీలతో మొత్తం 19,188 పరుగులు చేశాడు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా యూఏఈ వేదిక ఐపీఎల్ 2020 జరుగుతుండగా జోన్స్ ముంబై లోనే ఉంటూ దానికి కామెంట్రీ అందిస్తున్నారు. ఇక డీన్ జోన్స్ మరణానికి ఆసీస్ క్రికెటర్లతో పాటుగా ఇర్ఫాన్ పఠాన్ అలాగే తదితర భారత క్రికెటర్లు కూడా సంతాపం ప్రకటించారు.