డ్రగ్ కేసులో బుక్ అయిన ఆమెకు మాజీ సీఎం ఫోన్..!

డ్రగ్ కేసులో బుక్ అయిన ఆమెకు మాజీ సీఎం ఫోన్..!

కర్ణాటకలో వెలుగుచూసిన శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోందిద. ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ హీరోయిన్లు రాగిణి ద్వివేది సంజనలు అరెస్ట్ అయ్యారు.  ఈ కేసులో ప్రముఖ కన్నడ టీవీ యాంకర్ అనుశ్రీకి మంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేయడం సంచలనమైంది. మంగుళూరు సిటీ పోలీస్ లు డాన్సర్, బాలీవుడ్ నటుడు కిషోర్ శెట్టి తో పాటు అతని మిత్రుడు తరుణ్ ల ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే వీరి క్లోజ్ ఫ్రెండ్డే అనూష శ్రీ. వీరంతా కిషోర్ శెట్టి జరిపిన అనేక పార్టీలు లో డ్రగ్స్ వాడినట్లు పోలీసులకు సమాచారం ఉంది. వీటిలో కొన్ని పార్టీలలో అనుశ్రీ పాల్గొన్నట్లు తెలుస్తోంది.. అనుశ్రీ పేరును సీసీబీ అదుపులో ఉన్న తరుణ్ ప్రస్తావించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఇప్పటికే అనుశ్రీ  పోలీసుల ముందు హాజరైంది. అయితే..తాజాగా యాంకర్‌ అనుశ్రీపై మరో వార్త వైరల్‌ అవుతోంది. డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదని అనుశ్రీ శుక్రవారం ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అదే సమయంలో కుమారస్వామి గళమెత్తారు. డ్రగ్స్‌కేసులో అను శ్రీకి ఒక మాజీ సీఎం అండ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ మాజీ సీఎం ఎవరో బయట పెట్టాలని మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి శనివారం బెంగళూరులో డిమాండ్‌ చేశారు. అనుశ్రీకి మాజీ సీఎం ఒకరు ఫోన్‌ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఆరు మంది మాజీ సీఎంలున్నారు. ఎవరనేది ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. డ్రగ్స్‌ కేసును విస్తృతంగా దర్యాప్తు చేయాలని కోరారు.