ధోని రిటైర్మెంట్ గురించి వెంకటపతి రాజు ఏమన్నారంటే... 

ధోని రిటైర్మెంట్ గురించి వెంకటపతి రాజు ఏమన్నారంటే... 

ఇండియన్ క్రికెట్ టీంకు ధోని ఎన్నో విజయాలు అందించారు.  ఎంతోకాలంగా ఊరిస్తూ వస్తున్న వరల్డ్ కప్, మినీ వరల్డ్ కప్, 2020 వరల్డ్ కప్ వంటివి అందించారు.  ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో ఎంతో మందిని ఎంకరేజ్ చేసి మ్యాచ్ టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు అందరూ కూడా బ్యాటింగ్ చేసే విధంగా తీర్చి దిద్దిన ఘనత ధోనిదే అని చెప్పాలి.  

అయితే, గత కొంతకాలంగా ధోని ఫెయిల్ అవుతూ వస్తున్నాడు.  వరల్డ్ కప్ తరువాత ధోని టీం ఇండియా మ్యాచ్ లకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.  ఇండియా ఆడే ప్రతి మ్యాచ్ లో ఎక్కడో ఒకచోట మిస్ యు ధోని అనే ప్లకార్డు తప్పక కనిపిస్తుంది. ధోని రిటైర్మెంట్ విషయంలో అనేక ఊహాగానాలు వస్తున్నాయి.  ధోని ఎప్పుడు రిటైర్ అవుతాడు అనే విషయంపై ఒకనాటి క్రికెటర్, వ్యాఖ్యాత వెంకటపతి రాజు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.  ధోని లాంటి లెజెండ్ లు రిటైర్మెంట్ అన్నది వారి చేతుల్లోనే ఉంటుందని, వాళ్లకు ఎప్పుడు రిటైర్ కావాలని అనిపిస్తే అప్పుడు రిటైర్ అవుతారని అన్నారు.  దీంతో పాటుగా టీమ్ ఇండియా గురించిన మరికొన్ని విషయాలను రాజు పేర్కొన్నారు.  ఆ విషయాలకు సంబంధించిన పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.