ధోనీ, కోహ్లీల మధ్య ఉన్న తేడా అదే...

ధోనీ, కోహ్లీల మధ్య ఉన్న తేడా అదే...

టీంఇండియాకు ధోని, విరాట్ కోహ్లీ ఎన్నో అద్భుత విజయాలు అందించారు. విరాట్ కోహ్లీ కెప్టెన్ అయినప్పటికీ... ధోనీనే సలహాలు అడిగేవాడు. దీన్ని బట్టి తెలుస్తోంది... ధోని కెప్టెన్సీ విలువ. అందుకే ధోనిని ఇష్టపడని వాళ్లు ఉండరు. ఇలా ధోని, విరాట్ కోహ్లీ ఇద్దరు టీం ఇండియాకు విజయాలు అందించారు. ఈ క్రమంలో ధోనీ, కోహ్లి కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ ఆసక్తికర వ్యాక్యలు చేసాడు. 'జట్టును నడిపించడంలో ఇద్దరిదీ భిన్నమైన శైలి. ధోనీ అతిగా స్పిన్నర్ లపై ఆధారపడితే, కోహ్లి ఫాస్ట్ బౌలర్లపై ఎక్కువగా నమ్మకం ఉంచుతాడు. ఇద్దరి మధ్య తేడా ఇదే.... ప్రస్తుత జట్టు విదేశాల్లో రాణించేందుకు ప్రధాన కారణం ఇదే' అని అగార్కర్‌ పేర్కొన్నాడు. కెప్టెన్లుగా ఇద్దరు ఎన్నో ఘనతలు సాధించారని కూడా తెలిపాడు.