గుండెపోటుతో గ్రౌండ్‌లోనే క్రికెటర్ మృతి

గుండెపోటుతో గ్రౌండ్‌లోనే క్రికెటర్ మృతి

గోవా మాజీ రంజీ క్రికెటర్‌ రాజేష్‌ ఘోడ్గే (43) గుండె పోటుతో మైదానంలో కుప్పకూలి మృతి చెందాడు. పనాజీలో లోకల్‌ క్రికెట్ క్లబ్ టోర్నమెంట్‌లో రాజేష్‌ నిన్నటి మ్యాచ్‌లో ఆడాడు. 30 పరుగులు చేసి నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉండగా గుండెపోటు రావడంతో కూప్పకూలాడు. ఆయణ్ను హుటాహుటిన సమీపంలోని ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అపోలోకు తీసుకెళ్లమన్నారు. ఐతే.. అప్పటికే రాజేష్‌ ప్రాణాలు విడిచాడు.