ధోనీపై గంబీర్ విమర్శలు..అది మతిలేని చర్య..!

ధోనీపై గంబీర్ విమర్శలు..అది మతిలేని చర్య..!

నిన్న జరిగిన సీఎస్కె-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ రెండు జట్లు పోటా పోటీగా తలపడ్డాయి. ప్రత్యర్థి జట్టు పెట్టిన టార్గెట్ ను సీఎస్కె చేదిస్తుందని అందరూ భావించారు. సీఎస్కె సైతం గట్టిగానే ప్రయత్నించింది అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే బెస్ట్ ఫినిషర్ గా పేరున్న ధోని తనదైన స్టైల్ లో పోరాడి జట్టును గెలిపిస్తాడాని ఆశించినప్పటికి కోరిక నెరవేరలేదు. కాగా ధోని పై గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలు చేసారు. చెన్నై లక్ష్యం 217 పరుగులు ఉండగా ఇంత భారీ స్కోరు చేదనలో నంబర్4 లేదా 5 స్థానంలో బ్యాటింగ్ కు దిగాలి.. కానీ ధోని ఏడో స్థానంలో బ్యాటింగ్ దిగాడు. మురళీ విజయ్,ఋతురాజ్, శామ్ కరణ్ లు ధోని కంటే ముందు క్రీజులోకి వచ్చారు. అంటే వీళ్లంతా ధోని కంటే బెస్ట్ బ్యాట్స్ మేన్స్ అనుకోవాలా అని ప్రశ్నించాడు. కెప్టెన్ ముందుండి నడిపించడం అంటే ఇదేనా అని ప్రశ్నించాడు.  200 పరుగుల లక్ష్యాన్ని ధోని ఏవిధంగా ఏడో స్థానంలో వచ్చి జట్టును గెలిపిస్తాడాని అన్నాడు. ఇది పూర్తిగా మతిలేని చర్య అని వ్యాఖ్యానించారు. మ్యాచ్ ఆకర్లో ధోని చేసిన పరుగులు ఎందుకూ పనికిరావు అవి కేవలం అతడి స్కోరును పెంచుకోడానికి మాత్రమే పనికి వస్తాయి. 217 పరుగుల చేదనలో ఏ కెప్టెన్ ఏడో స్థానంలో బరిలోకి దిగినా విమర్శలు వస్తాయి..కానీ ఆ  పని ధోని చేయటంతో పెద్దగా విమర్శలు రావడం లేదని గంబీర్ వ్యాఖ్యానించారు.