క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తెలుగు ఆటగాడు

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తెలుగు ఆటగాడు

టీమిండియా మాజీ ఆటగాడు, ఆంధ్ర రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ వై.వేణుగోపాలరావు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 37 ఏళ్ల వేణు.. అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా, పార్ట్‌ టైమ్‌ బౌలర్‌గా పేరు తెచ్చుకున్న వేణు.. ఐపీఎల్‌లోనూ రాణించాడు. 2005లో తొలిసారి టీమిండియా తరఫున ఆడిన వేణుగోపాల్‌.. కెరీర్‌లో 16 వన్డే మ్యాచ్‌లాడి ఒక అర్ధసెంచరీ, 24.2 సగటుతో కేవలం 218 పరుగులు మాత్రమే సాధించాడు. 2006లో వెస్టిండీస్‌తో ఆడిన వన్డే అతని ఆఖరిది.

21 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడిన వేణు.. 17 సెంచరీలు, 30 అర్ధ సెంచరీలతో 7081 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున మొత్తం 65 వన్డేలు ఆడాడు. ఆంధ్ర క్రికెట్‌కు వేణుగోపాలరావు అందించిన సేవలు అమోఘమని.. భవిష్యత్‌లో అతడికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నామని ఆంధ్ర క్రికెట్‌ సంఘం ఓ ప్రకటనలో తెలిపింది