రాయుడిని అందుకే తొలగించాము : మాజీ సెలక్టర్ గగన్ ఖోడా

రాయుడిని అందుకే తొలగించాము : మాజీ సెలక్టర్ గగన్ ఖోడా

2019 ప్రపంచ కప్ కోసం అంబటి రాయుడికి బదులుగా విజయ్ శంకర్ ను సెలెక్ట్ చేయడం అప్పట్లో చాలా చర్చలకు దారి తీసింది. దానికి తోడు ఆ టోర్నీ జరుగుతున్న సమయంలోనే రాయుడు క్రికెట్ కు వీడ్కోలు పలకడం ఇంకా హల్ చల్ చేసింది. అయితే ఈ విషయం పై మాజీ సెలక్టర్ గగన్ ఖోడా స్పందించారు. రాయుడి విషయం గురించి మాట్లాడుతూ... ''అప్పడు ప్రపంచ కప్ జట్టును సెలెక్ట్ చేసే వరకు రాయుడికి చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే తుది ఎంపిక చేసే రోజు అతను సెలక్ట్ కాలేదు. మేము అతనితో ఒక సంవత్సరం పాటు కొనసాగాము, కానీ అతను ఉన్న చోటనే ఉన్నాడని భావించాము. అతడిలో ప్రపంచ కప్‌కు వెళ్లి ఆడే విశ్వాసం మాకు కనిపించలేదు. అందుకే ప్రపంచ కప్ కు మేము అతడిని సెలక్ట్ చేయలేదు'' అని తెలిపాడు. అయితే రాయుడికి బదులుగా ఎంపిక చేసిన విజయ్ శంకర్ ప్రపంచ కప్ లో తన ప్రదర్శనతో అభిమానులను, జట్టును నిరాశపరిచిన విషయం అందరికి తెలిసిందే.