టీఆర్ఎస్‌కు నేనూ ఓనర్‌నే! కిరాయి వాళ్లు ఎప్పుడు దిగిపోతారో?

టీఆర్ఎస్‌కు నేనూ ఓనర్‌నే! కిరాయి వాళ్లు ఎప్పుడు దిగిపోతారో?

తెలంగాణ మాజీ హోం మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని  నర్సింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి విషయంలో సీఎం కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ముషీరాబాద్ టికెట్ అడిగితే... ముఠా గోపాల్‌ను గెలిపించుకునిరా... మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారని. కానీ, మంత్రి పదవి ఇవ్వలేదని ఆరోపించారు. హోంమంత్రిగా పని చేసిన తనకు ఛైర్మన్ పదవి ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ తమ ఇంటి పెద్ద అన్న నాయిని... టీఆర్‌ఎస్‌ పార్టీకి తాను కూడా ఓనరేననన్నారు. కిరాయికి వచ్చిన వాళ్లు ఎప్పుడు దిగిపోతారో తెలియదంటూ మీడియా చిట్‌చాట్‌లో హాట్ కామెంట్లు చేశారు నాయిని నర్సింహారెడ్డి. కాగా, టీఆర్ఎస్‌లో గత కొంత కాలంగా ఇలాంటి కామెంట్లు వినపడుతున్నాయి. మంత్రి ఈటల రాజేందర్ తాము గులాబీ పార్టీ ఓనర్లం అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాయిని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.