మాజీ మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు...!

మాజీ మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు...!

టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పార్టీ కార్యకర్తలకే కాకుండా.. తనకూ బాధ కలిగిస్తున్నాయని తుమ్మల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.  కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు.  ఎవరూ తొందర పడవద్దని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అంతా తెలుసునని అన్నారు. కాంగ్రెస్‌ను మోసే వారిని గెలిపించుకోవాల్సిన ఆగత్యం మనకు పట్టలేదన్నారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో పాలేరు నియోజక వర్గాన్నిసస్యశ్యామలం చేశానని... సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు వరం లాంటిదన్నారు తుమ్మల.

కాగా, టీఆర్ఎస్‌పై  తుమ్మల  కొంతకాలం నుంచి అసంతృప్తితో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే... అది నిజమే అనిపిస్తోంది. తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో తుమ్మల ఈ  వ్యాఖ్యలు చేశారు. అయితే మనం పార్టీ లైన్ దాటలేమని... సరిదిద్దాల్సిన భాధ్యత కేసీఆర్‌దే అని తుమ్మల స్పష్టం చేశారు. అప్పటివరకు మనం చూస్తూ ఉండాల్సిందే అని వ్యాఖ్యానించారు. కరువు నుంచి జిల్లా ప్రజలను బయటపడేసిన సంతృప్తి తనకు ఉందన్న తుమ్మల... ఏ సమస్య వచ్చినా అండగా ఉండే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.