వైసీపీలో చేరిన కాండ్రు కమల

వైసీపీలో చేరిన కాండ్రు కమల

గురువారం మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల వైసీపీలో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో కమల వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా జగన్ ఆమెకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాండ్రు కమల మాట్లాడుతూ... రాష్ట్రం అభివృద్ధి చేస్తా అని అధికార దాహంతో వంచన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు సీఎం చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు.. ఆయన కుటుంబం, అబ్బాయి కోసమే నాటకాలు వేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు బీసీకే మంగళగిరి ఇస్తా అని నమ్మించి మాట తప్పారు, చంద్రబాబు ఎన్నటికీ మారడని కమల మండిపడ్డారు. దీనికి నిరసనగా బయటికి వచ్చేస్తున్నా.. బీసీలు అలర్ట్ గా ఉండాలి. వంచన చేస్తోన్న టీడీపీని ఓడించడానికి బీసీలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ తరఫున 2009లో ఎన్నికల్లో కాండ్రు కమల ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉంది. అనంతరం కొన్ని పరిణామాలతో టీడీపీలో చేరారు. టీడీపీ అధిష్టానం ప్రస్తుత ఎన్నికల్లో మంగళగిరి సీటు నారా లోకేశ్‌కు కేటాయించడంతో.. అసంతృప్తిగా ఉన్న కమల వైసీపీలో చేరారు.