వైసీపీ ఎమ్మెల్యే ఇంట విషాదం !

వైసీపీ ఎమ్మెల్యే ఇంట విషాదం !


శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియెజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి పార్వతీపురం పార్లమెంట్‌ నియెజకవర్గం మాజీ ఎంపీ, కొత్తూరు నియెజకవర్గ మాజీ ఎమ్మెల్యే విశ్వసరాయి నరసింహ రావుదొర ఈరోజు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 95 సంవత్సరాలు. ఆయన పేరు నరసింహారావు అయినా  వండవదొరగా జనానికి దగ్గరయ్యారు. తన స్వగ్రామం వీరఘట్టాం మండలం వండవ గ్రామంలో తుది శ్వాస విడిచారు.

1956 లో సర్పంచ్‌ గా పని చేసిన ఆయన 1967 లో స్వత్రంత్య పార్టీ ఎంపీ గా గెలుపొందారు. 1972 లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. 1978లో జనతా పార్టీలో చేరిన ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985లో కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే సందర్భంలో గిరిజన కార్పొరేషన్‌ చైర్మన్‌ గా, పిపిసి ప్రధాన కార్యదర్శిగా 30 ఏళ్ళు, వీరఘట్టాం, వండవ సొసైటీ అధ్యక్షులుగా పని చేశారు. నరసింహారావు దొర కుమార్తె కళావతి ప్రస్తుతం పాలకొండ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు, ఆమె ఇప్పుడు వైసీపీలో ఉన్నారు.