కాంగ్రెస్‌ గూటికి మాజీ ఎంపీ...

కాంగ్రెస్‌ గూటికి మాజీ ఎంపీ...

తెలంగాణ రాష్ట్ర సమితికి గుడ్‌ చెప్పారు రమేష్ రాథోడ్... ఏడాదిన్నర క్రితం గులాడి కండువ కప్పుకున్న ఆయన ఖానూపూర్ ఎమ్మెల్సీ సీటు ఆశించి భంగపడ్డారు. తెలుగుదేశం పార్టీలో ఎంపీగా పనిచేసిన ఆయన... టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరారు. కేసీఆర్‌ టికెట్ ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్‌కు గడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. రేపు హైదారాబాద్‌లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా సమక్షంలో రమేష్ రాథోడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. టీడీపీలో ఉన్న సమయంలో ఆదిలాబాద్ జిల్లాలో రమేష్ రాథోడ్ హవా నడిచింది. మారిన రాజకీయ పరిణామాలు ఆయనకు అనుకూలంగా లేకపోవడంతో టీఆర్ఎస్‌లో చేరారు. అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేఖానాయక్‌కు రమేష్‌కు మధ్య రాజకీయ వైరం ఉంది. ప్రస్తుతం టీఆర్ఎస్‌ నుంచి తెగదెంపులు చేసుకున్న రమేష్... కాంగ్రెస్ పార్టీ నుంచి ఖానాపూర్‌ బరిలో దిగే అవకాశం ఉంది.