అంబరీశ్‌కు కుమారస్వామి, దేవెగౌడ నివాళులు

అంబరీశ్‌కు కుమారస్వామి, దేవెగౌడ నివాళులు

ప్రముఖ కన్నడ నటుడు అంబరీశ్‌ కన్నుమూశారు. శనివారం సాయంత్రం అంబరీశ్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. ఆయనను వెంటనే బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే ఆయన తుదిశ్వాస విడిచారు. అంబరీష్ మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. కర్ణాటక సీఎం కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడ అంబరీష్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకున్నారు.  అనంతరం దేవెగౌడ.. అంబరీశ్‌ సతీమణి సుమలతను ఓదార్చారు.