ద్రవ్యలోటు.. ఆర్బీఐ మాజీ గవర్నర్ రాజన్ ఆందోళన..

ద్రవ్యలోటు.. ఆర్బీఐ మాజీ గవర్నర్ రాజన్ ఆందోళన..

భారత ద్రవ్యలోటు ప్రమాదకర స్థాయిలో ఉందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ హెచ్చరించారు. బ్రౌన్‌ విశ్వవిద్యాలయంలో ఆయన ప్రసంగించారు. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతున్న తరుణంలో భారత్‌ తన నిర్ణయాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, 2016లో భారత వృద్ధి రేటు 9శాతం ఉండగా, క్రమక్రమంగా ఇప్పుడు 5 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు రాజన్‌. దేశంలో పెట్టుబడులు, వినియోగం, ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేవని అభిప్రాయపడ్డారు. దేశంలోని కీలక నిర్ణయాలలో రాజకీయ వ్యవస్థ విపరీతమైన జోక్యం చేసుకుంటుందని రాజన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.