రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు...

రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు...

ఆర్థిక పరిస్థితిపై ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రస్తుత వృద్ధి రేటు ఏమాత్రం సరిపోదన్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా తాజా గణాంకాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవని తెలిపారాయన. యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా దేశ ఆర్థిక వ్యవస్థ సాగడం లేదన్నారు. ఐదేళ్లలో భారత ఆర్థిక పరిస్థితి తీవ్ర నిరాశజనకంగా మారిందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ సుస్థిరత..  లోటు భర్తీకి మోడీ ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు చేపట్టాల్సి ఉందన్నారు రఘురాం రాజన్‌.