సీజేఐ కుట్ర కేసుపై రిటైర్డ్ జస్టిస్ ఏకే పట్నాయక్ తో దర్యాప్తు

సీజేఐ కుట్ర కేసుపై రిటైర్డ్ జస్టిస్ ఏకే పట్నాయక్ తో దర్యాప్తు

సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ని పదవి నుంచి తొలగించేందుకు కుట్ర జరుగుతోందన్న లాయర్ ఉత్సవ్ బెయిన్స్ ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు సుప్రీంకోర్ట్ రిటైర్డ్ జస్టిస్ ఏకే పట్నాయక్ తో దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్ట్ నిర్ణయించింది. సీజేఐ రంజన్ గొగోయ్ ని లైంగిక వేధింపుల కేసులో ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని ఉత్సవ్ బెయిన్స్ గట్టిగా వాదిస్తున్నారు. జస్టిస్ ఏకే పట్నాయక్ ఉ సహకరించాల్సిందిగా సీబీఐ, డైరెక్టర్, ఐబీ చీఫ్ లను సుప్రీంకోర్ట్ ఆదేశించింది. సీజేఐ రంజన్ గొగోయ్ పై వచ్చిన ఆరోపణలు ఈ దర్యాప్తు పరిధిలోకి రావని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కుట్ర వ్యవహారంపై మాత్రమే దర్యాప్తు జరుగుతుందని తెలిపింది. జస్టిస్ పట్నాయక్ సీల్డ్ కవర్ లో దర్యాప్తు నివేదికను కోర్టుకు అందజేస్తారు. 

అంతకు ముందు గురువారం ఉదయం న్యాయవాది ఉత్సవ్ బెయిన్స్ తన అదనపు అఫిడవిట్, సీల్డ్ కవర్ లో సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. మరో అఫిడవిట్ ఇచ్చి ఈ మొత్తం వ్యవహారంలో ఏ జడ్జి లేదా వారి బంధువుల ప్రభావం లేదని కోర్టుకు స్పష్టం చేయాలనుకుంటున్నట్టు బెయిన్స్ తెలిపారు. ఈ కేసులో పెద్ద కుట్ర దాగుందని సూచిస్తూ కోర్టు, ధనవంతులు మరియు శక్తివంతులు ఈ కుట్ర వెనక ఉండవచ్చని అభిప్రాయపడింది. వాళ్లు నిప్పుతో చెలగాటమాడుతున్నారనే విషయం గుర్తుంచుకోవాలని  హెచ్చరించింది.