గంగూలీని అప్పుడు చూస్తే నవ్వొస్తుంది... 

గంగూలీని అప్పుడు చూస్తే నవ్వొస్తుంది... 

భారత మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ ఎప్పుడు దూకుడుగా ఉంటాడు. తాను కెప్టెన్ గా ఉన్న సమయంలో జట్టును  విజేతగా నిలిపేందుకు దాదా చాల శ్రమ పడ్డాడు. అయితే తాను ఎంత మంచి కెప్టెన్ అయిన తన దూకుడు స్వభావంతోనే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు గంగూలీ. ఈ విషయం గురించి దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్‌స్మిత్ మాట్లాడుతూ... దాదాను  కవ్విస్తే అతని దగ్గరి నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో అందరికి తెలుసు. దానికి ఒక మంచి ఉదాహరణ అని 2002 లో ఇంగ్లాండ్ తో నాట్‌వెస్ట్‌ సిరీస్‌‌లో జరిగిన మ్యాచ్ లో గంగూలీ చోక్కా విప్పిన సందర్భాన్ని స్మిత్ గుర్తుచేసున్నారు. 2002 నాట్వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో భారత్ గెలిచినప్పుడు లార్డ్స్ ‌బాల్కనీలో దాదా  చోక్కా విప్పి ఆ విజయానికి సంబరాలు చేసాడు. అయితే నాకు ఆ వీడియో చూస్తుంటే నవ్వొస్తుంది. ఆ సందర్భాన్ని గుర్తుచేసుకున్పప్పుడు మ్యాచ్ గెలవాలన్నా భారత్ తపన.. విదేశీ గడ్డపై గెలుపు కోసం అరాటపడే జట్టు కొరిక నాకు అర్ధమవుతుంది అన్నారు. అయితే మైదానంలో మేమిద్దరం స్లెడ్జ్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అని చెప్పిన స్మిత్ తాను ఎప్పుడు దాదాకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాడిని అని చెప్పాడు.