రేపే రామాయపట్నం పోర్ట్ పనులకు శ్రీకారం

రేపే రామాయపట్నం పోర్ట్ పనులకు శ్రీకారం

రామాయపట్నం పోర్ట్ నిర్మాణానికి రేపు  సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు.అమరావతిలో ఏపీ  పోర్ట్స్ డైరెక్టర్ కొయ ప్రవీణ్ మాట్లాడుతూ.. 5 వేల కోట్లతో  ప్రకాశం జిల్లా ఉలవపాడులో రామాయపట్నం పోర్ట్ నిర్మాణం జరుగుతుందన్నారు.దేశంలోనే అతి పెద్ద బ్రేక్ వాటర్ 3.8 కీ.మీ. తుత్తుకుడి పోర్టుకి ఉందని.. రామాయపట్నం పోర్ట్  దాని కంటే ఎక్కువగా 4.9కిమీ మేర బ్రేక్ వాటర్ ఉందన్నారాయన. పోర్ట్  నిర్మాణం జరిగితే పారిశ్రామిక రంగంలో ఎంతో అభివృద్ధి జరుగుతుందని కొయ ప్రవీణ్ చెప్పారు.జనవరి 2020లో టెండర్లు పిలుస్తామని, 2023 నాటికి  పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు. పోర్ట్ నిర్మాణానికి ఇంకా 3,500 ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉందన్నారాయన.కృష్ణపట్నం పోర్టు సమీపంలోనే ఏపీ భౌగోళిక స్వరూపం ప్రత్యేకతల కారణంగా రామాయపట్నం పోర్టుకు చక్కటి అవకాశాలున్నాయని చెప్పుకొచ్చారు ఏపి పోర్ట్స్ డైరెక్టర్ కొయ ప్రవీణ్.