రైలు పట్టాలపై కిలోమీటర్‌ కొక డెడ్‌బాడీ...వారి పనే !

రైలు పట్టాలపై కిలోమీటర్‌ కొక డెడ్‌బాడీ...వారి పనే !

అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో రైలుపట్టాలపై నాలుగు మృతదేహాలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళ మృతదేహాలు పట్టాలపై పడి ఉండడాన్ని చూసి పోలీసులకి సమాచారం ఇచ్చారు స్థానికులు. కిలోమీటర్‌కు ఒక డెడ్‌బాడీ చొప్పున పడి ఉండడంతో పలు అనుమానాలు తావిచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇవి ఆత్మహత్యలా..?, లేక హత్యలా..? అనే కోణంలో దర్యాప్తు చేశారు.

కొటిపి సమీపంలో రెండు మృతదేహాలు, మల్లాపురం, దేవరాపల్లిలో ఒక్కొక్క మృతదేహం పడి ఉన్నాయని గుర్తించారు. అయితే పది రోజుల క్రితం జరిగిన ఈ హత్యలను  హిందూపురం పోలీసులు ఛేదించారు.  కొటిపి మండల పరిధిలోని బేవినహళ్లి సమీపంలో హతమార్చి ఆ దంపతుల మృత దేహాలను రైల్వే ట్రాక్ పడేసినట్లు  జిల్లా ఎస్పీ సత్య ఏసు బాబు వెల్లడించారు. అప్పు కట్టమని అడగటాన్ని అవమానంగా భావించి కడతేర్చారని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఇక ఈ  ఈ జంట హత్య ల కేసులో ఐదుగుర్ని అరెస్ట్ చేసి వారి నుంచి 70 వేల  నగదు , 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.