ఆలయంలో అపశృతి.. నలుగురు మృతి

ఆలయంలో అపశృతి.. నలుగురు మృతి

తమిళనాడులోని కాంచీపురంలో జరుగుతున్న అత్తివరద రాజస్వామి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో నలుగురు భక్తులు మృతి చెందారు. తొక్కిసలాటలో 9 మంది సొమ్మసిల్లి పడిపోగా.. ఆలయ సిబ్బంది ఆస్పత్రికి తీసుకెళ్లారు. మార్గంమధ్యలోనే నలుగురు ప్రాణాలు కోల్పోగా..  ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో గుంటూరుకు చెందిన నారాయణమ్మ అనే మహిళ కూడా ఉన్నారు. ఈ నెల 1న ప్రారంభమైన ఉత్సవాలు 48 రోజులపాటు జరుగుతాయి. ఐతే.. 18వ రోజైన గురువారం శ్రవణా నక్షత్రం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.