శ్రీశైలం డ్యామ్ 4 గేట్లు ఎత్తివేత.. సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు..!!

శ్రీశైలం డ్యామ్ 4 గేట్లు ఎత్తివేత.. సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు..!!

ఎగువున వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారిపోయాయి.  శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో ఈరోజు సాయంత్రం డ్యామ్ నాలుగు గేట్లను ఎత్తివేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి లక్ష క్యూసెక్కుల నీరు దిగువప్రాంతానికి వదిలారు.  గేట్లు తెరుచుకోగానే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జున సాగర్ వైపు పరుగులు తీసింది.  ఈ దృశ్యాలను చూసేందుకు సందర్శకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ నాలుగు గేట్ల ద్వారా దాదాపు లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 

ఈ సీజన్‌ లో తొలిసారి గేట్లు ఎత్తుతుండటంతో  ఏపీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, తెలంగాణ మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ కృష్ణమ్మకు పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి అనిల్‌కుమార్‌ నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.