అక్కడ ఐదు రూపాయలకే నాలుగు ఇడ్లీలు..

అక్కడ ఐదు రూపాయలకే నాలుగు ఇడ్లీలు..

ఐదు రూపాయలకు ఏమొస్తుంది అంటే.. ఏమి చెప్పలేరు. చిన్న పిల్లల దగ్గరి నుంచి పండు ముసలివాళ్లు వరకు అందరు తినదగిన ఆహారం ఇడ్లీ.  మాములుగా బయట బండిమీద నాలుగు ఇడ్లీలు తినాలి అంటే కనీసం రూ. 20 రూపాయలు చెల్లించాలి.  కానీ, మెహబూబ్ నగర్లో జేబులో ఐదు రూపాయలు ఉంటె నాలుగు ఇడ్లీ తినొచ్చు.  అదెలా అని షాక్ అవ్వకండి.  

పట్టణంలోని జిల్లా జైలు ఎదురుగా జైలు ఖైదీలతో అల్పాహార హోటల్ ను ఏర్పాటు చేశారు.  మూడు రోజుల క్రితం ఈ హోటల్ ప్రారంభం అయ్యింది.  ఇందులో ఐదు రూపాయలకు నాలుగు ఇడ్లీలు అందిస్తున్నారు.  మొదటి రోజు కేవలం 400 మంది వినియోగదారులు రాగ, మూడు రోజు వచ్చే సరికి ఈ సంఖ్యా 1100 మందికి చేరింది.  గిరాకీ పెరగడంతో ఆదాయం కూడా పెరిగినట్టు జైలు అధికారులు చెప్తున్నారు.  రోజుకు రూ. 7 నుంచి రూ. 9 వేల వరకు ఆదాయం లభిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు.  ఈ ఐడియా చాలా బాగుంది కదా.  ఎంత లేదన్నా కనీసం ఇందులో మూడువేల రూపాయల వరకు మిగులు ఉంటుంది.