'దేవదాస్' ట్రైలర్ ఆగేలా లేదు !

'దేవదాస్' ట్రైలర్ ఆగేలా లేదు !

నాగార్జున, నానీలు కలిసి చేస్తున్న 'దేవదాస్' ట్రైలర్ ఇటీవలే విడుదలైంది.  ట్రైలర్లోనే బోలెడంత ఫన్ నిండి ఉండటంతో ప్రేక్షకులు సినిమాలో ఇంకెంత ఫన్ ఉంటుందో అనుకుంటున్నారు.  నాగ్, నానీలు కొత్తగా కనిపించడమేగాక వారి నటనలో కూడ కొంత భిన్నత్వం కనిపించేలా ఉంది ట్రైలర్. 

ఇప్పటి వరకు ఈ ట్రైలర్ కు నాలుగు మిలియన్ల వ్యూస్ దక్కగా ఇంకో రెండు రోజుల్లో ఈ మొత్తం 5 మిలియన్లకు చేరే అవకాశాలున్నాయి.  ఈ నెల 27వ తేదీన విడుదలకానున్న ఈ చిత్రాన్ని సరేరామ్ ఆదిత్య డైరెక్ట్ చేశాడు.  ఇందులో నాని సరసన రష్మిక నటించగా నాగార్జునకు జోడీగాఆకాంక్ష సింగ్ నటించింది.