కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద 40 మంది..

కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద 40 మంది..

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. నగరంలోని డోంగ్రి ప్రాంతం తండెల్‌ వీధిలో నాలుగంతస్తుల భవనం కొద్దిసేపటి క్రితం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద 40 మందికి పైగా చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఘటనాస్థలికి ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్‌ చేరుకుని సహాయ చర్యలను చేపడుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు భవనాల గోడలు కూలి వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటువంటి ఘటనల్లో ఈ నెల రోజుల్లో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు.